అడ్డదారి అదానీ అందరినీ ముంచేశాడు..
27 January, 2023
అడ్డదారి అదానీ అందరినీ ముంచేశాడు..

చూస్తుండగానే ప్రపంచకుబేరుల జాబితాలో చేరిపోయాడు. అన్ని రంగాల్లో వేలుపెట్టేశాడు. చివరికి మీడియాను కూడా వదల్లేదా బిగ్‌ బిజినెస్‌మ్యాన్‌. ఇక షేర్‌ మార్కెట్‌లో ఆయన కంపెనీల షేర్లు మొన్నటిదాకా రేసుగుర్రాలే. కానీ అయ్యగారి బండారం బయటపడింది. షేర్లు పాతాళానికి పడిపోయాయి. అప్పుచేసి పప్పుకూడు తింటున్న విషయం ప్రపంచానికి తెలిసిపోయింది. అంబానీకి నేనే పోటీ అంటూ అడ్డదారుల్లో ఎదుగాలనుకున్న అదానీ బతుకు బజార్నపడింది. గౌతమ్‌ అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్‌ కంపెనీలు అప్పుల కుప్పలేనని తేల్చేసింది హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌. ఆ […]

18వేల‌మంది ఊస్టింగ్‌.. అమెజాన్ న్యూ ఇయ‌ర్ గిఫ్ట్‌!
9 January, 2023
18వేల‌మంది ఊస్టింగ్‌.. అమెజాన్ న్యూ ఇయ‌ర్ గిఫ్ట్‌!

కొత్త సంవ‌త్స‌రంలో చావుక‌బురు చ‌ల్ల‌గా చెప్పింది. కొత్త క‌బురేం కాదు ఇదివ‌ర‌కు పేల్చిన బాంబునే మ‌రోసారి పేల్చింది. 2023లో 18వేల‌మంది ఉద్యోగుల‌పై వేటు త‌ప్ప‌ద‌ని ప్ర‌క‌టించారు అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ. దీంతో ఉద్యోగాల ఊచ‌కోత మొద‌లుకాబోతోంది. క‌త్తి ఎవ‌రి మెడ‌పై ప‌డుతుందోన‌ని దిన‌దిన‌గండంగా రోజులు వెళ్ల‌దీస్తున్నారు అమెజాన్ ఉద్యోగులు. లేఆఫ్‌. అంటే ఉద్యోగ‌జీవితం ముగిసిన‌ట్లే. కొత్త సంవత్సరంలో ఉద్యోగుల‌కు ప్ర‌మాద‌హెచ్చ‌రిక‌లు పంపింది ఈ కామ‌ర్స్ దిగ్గ‌జ‌సంస్థ అమెజాన్‌. 18వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించేందుకు అమెజాన్ సిద్ధ‌మైంది. […]