రేవంత్ ట్రాప్‌లో బీజేపీ

By KTV Telugu On 6 May, 2024
image

KTV TELUGU :-

ఎన్నికలకు ఎజెండా డిసైడ్ చేసే పార్టీకే ఎక్కువ ఫలితాలు వస్తాయి. అలాంటి అజెండా డిసైడ్ చేయడానికి అందరూ ప్రయత్నిస్తారు. ఈ విషయంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు.  ముస్లిం రిజర్వేషన్ల రద్దు అంటూ బీజేపీ ఎజెండా సెట్ చేయాలనుకుంది కానీ..రేవంత్ రెడ్డి మొత్తం ఎస్సీ, ఎస్టీ,  బీసీ రిజర్వేషన్ల రద్దు వరకూ తెచ్చేశారు. ఇప్పుడు అలా రద్దు చేయం అని చెప్పడానికి  బీజేపీ తంటాలు పడుతోంది. కానీ రేవంత్ దూకుడుగా  అసలు ఆరెస్సెస్ విధానం రిజర్వేషన్ల రద్దేనని బలంగా వాదిస్తున్నారు. దానికి కౌంటర్ ఇవ్వలేక బీజేపీ తంటాలు పడుతోంది. బీఆర్ఎస్ అసలు స్పందించలేకపోతోంది. కారణం ఏదైనా రేవంత్ రెడ్డి ఎన్నికల ఎజెండా రిజర్వేషన్ల రద్దు చుట్టూ తిప్పుతున్నారు.  ఆ ట్రాప్ లో బీజేపీ పడిపోయింది. బీఆర్ఎస్ కు అసలు దారి తెలియడం లేదు.

రేవంత్ రెడ్డి తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లోనూ డబుల్ డిజిట్ సాధిస్తే జాతీయ స్థాయిలో కీలక నేతగా ఎదుగుతారనడంలో సందేహం లేదు. ఆయన కాంగ్రెస్ చేరిన అనతికాలంలోనే సీఎం అయ్యారు. సీఎం అయిన కొద్ది రోజుల్లోనే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి విధివిధానాలు డిసైడ్ చేసేలా మారిపోయారు.  రిజర్వేషన్ల రద్దు అంశాన్ని జాతీయ స్థాయి ఎన్నికల అంశంగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు.  రేవంత్ స్ట్రాటజీతో బీజేపీ దానికి వివరణలు ఇచ్చుకుంటూ పోతోంది. ఈ  విషయంలో కాంగ్రెస్ పైచేయి

కావడంతో… విపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు, సోషల్ మీడియా ప్రచారం అంతా తేలిపోతోంది.  రిజర్వేషన్ల రద్దు చుట్టూ బీజేపీ, కాంగ్రెస్ రాజకీయాలు చేసుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు.. అమిత్ షా పేక్ వీడియో తర్వాత అదే హాటా టాపిక్ అయింది. కేసులు నమోదు కావడంతో అదే అంశం ఎన్నికల వరకూ సాగేలా ఉంది.

బీజేపీ ఒక వైపు రాముడు, మతపరమైన రిజర్వేషన్ల అంశంపై ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ   రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగ మార్పును ఓటింగ్ ప్రయారిటీగా మార్చాలని ప్రయత్నిస్తోంది.  అదే సమయంలో తమ ఎన్నికల ప్రచారంలో బీఆరెస్‌ లేవనెత్తుతున్న అంశాలు ఆ పార్టీ ఆశించినంతగా ప్రజల్లో వెళ్లటం లేదు.    హైదరాబాద్‌ను యూటీ చేస్తారని బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను మరికొంతకాలం కొనసాగిస్తారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపిస్తూ వస్తున్నారు.  దీని ద్వారా తెలంగాణ సెంటిమెంట్‌ను మరోసారి పెంచి ఓటర్లను  ఆకర్షించే ప్రయత్నం చేశారు.  పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో బీఆరెస్‌కు  ప్రచారాంశం కొరత స్పష్టంగా కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికలు కావడంతో రాష్ట్ర అంశాలను హైలెట్ చేయలేకపోతున్నారు. జాతీయ అంశాలపై స్పందించలేకపోతున్నారు.  ఆ రెండు పార్టీల ట్రాప్ లో పడటం కన్నా సైలెంట్ గా ఉండటం మంచిదని అనుకుంటున్నారు. ఫలితంగా బీఆర్ఎస్ కరెంట్ టాపిక్ లో పెద్దగా వినిపించడం లేదు.

పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలను గెల్చుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్న భారత రాష్ట్ర సమితి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించే ప్రయత్నం చేసింది. ఆ సెంటిమెంట్ అస్త్రాల్లో ఒకటి హైదరాబాదా. హైదరాబాద్ ను యూటీ చేస్తారని.. దాన్ని అడ్డుకునే శక్తి   బీఆర్ఎస్ కే ఉందని కేటీఆర్ ప్రతీ చోటా చెబుతున్నారు   అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో ఆ రెండు పార్టీలను దాటి ఓటర్లు బీఆరెస్‌కు ఓటువేసేలా ఈ వ్యూహం పని చేస్తుందని అనుకున్నారు. కానీ ప్రజల్లో దీనిని హాట్ టాపిక్ చేసేలా సఫలం కాలేకపోయారని స్పష్టంగా కనిపిస్తోంది.  ప్రస్తుతం బీఆర్ఎస్ కు ఏదీ కలసి రావడం లేదు. తమకు కలసి వచ్చిన రోజున చేసిన రాజకీయంతో కథ మార్చేస్తారు. కానీ మళ్లీ అలాంటి రోజులు వస్తాయాలేదా అన్న అనుమానాలు బలంగా ఏర్పడుతున్నాయి.

రాను రాను ఎన్నికల నినాదాలు పోలరైజ్ అవుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఎన్నికలు జరుగుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఇష్యూ జాతీయ అంశం కావడం దీనికి కారణం. నిజానికి రిజర్వేషన్లపై కేసీఆర్ గతంో అనేక  హామీలు ఇచ్చారు. మైనార్టీ రిజర్వేషన్ల పెంపుపై హామీ ఇచ్చారు.దానిపై ఆయన మాట్లాడటం ద్వారా ముస్లింలను ఆకట్టుకోవచ్చు. గిరిజనుల రిజర్వేషన్లు

పెంచుతూ జీవో కూడా ఇచ్చారు. దానిపైనా మాట్లాడి .. వారి మద్దతు పొంద వచ్చు. కానీ కేసీఆర్ , కేటీఆర్ మాత్రం ఆ అంశాలపై అసలు మాట్లాడటం లేదు. కారణమేమిటో కానీ వారు బస్ మిస్సయ్యారన్న అభిప్రాయం మాత్రం వినిపిస్తోంది.

రాజకీయాలు చాలా క్లిష్టమైనవి. పక్క పార్టీ సెట్ చేసిన ఎజెండాలోకి వెళ్తే ట్రాప్ లో పడిపోయినట్లవుతుంది. తాము ఎజెండా సెట్ చేయాలంటే కాలం కలసి రావాలి. బీఆర్ఎస్ కు ఏదీ కలసి రావడం లేదు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి