ప్రచారానికి దూరంగా సీనియర్ కమలనాథులు

By KTV Telugu On 6 May, 2024
image

KTV TELUGU :-

ఎపి లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో సీనియర్లు ఎందుకు కనిపించటం లేదు… టిక్కెట్లు దక్కలేదని అలిగారా..లేదంటే పురందేశ్వరి కుట్ర రాజకీయాలతో సీనియర్లు గుర్రుగా ఉన్నారా…సొంత పార్టీని టిడిపికి తాకట్టుపెట్టేసారని మండిపడుతున్నారా…. అందుకే ప్రచారాలకి దూరంగా ఉంటున్నారా…ఎన్నికల వేళ ఎపి బిజెపిలో ఏం జరుగుతోంది…

ఎపి బిజెపి ఎన్నికల ప్రచారానికి సీనియర్లు దూరంగా ఉండటం పార్టీలో దుమారం రేపుతోంది…పురందేశ్వరి వైఖరితో విసుగెత్తిన సీనియర్లు పార్టీ ప్రచారాలలో ఎక్కడా పాల్గొనడం లేదు…పార్టీలో మొదటి నుంచి కష్టపడిన వారికి కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి రాత్రికి రాత్రే బిజెపిలో చేర్పించి టిక్కెట్లివ్వడంపై సీనియర్లు తీవ్ర ఆగ్రహంగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది..ఎపిలో బిజెపి టిడిపి, జనసేనతో కలిసి పోటీ చేస్తోంది..సీనియర్లు చాలా మంది ఒంటరి పోరే బిజెపికి మంచిదని సూచించినా పురందేశ్వరితో పాటు టిడిపి నుంచి బిజెపిలో చేరిన సిఎం రమేష్, సుజనా చౌదరి లాంటి నేతల లాబీయింగ్ తో పొత్తు కుదరింది కానీ మొదట నుంచి పొత్తులో బిజెపికి నష్టం జరిగేలా నిర్ణయాలు జరిగాయి.

టిక్కెట్ల దగ్గర నుంచి అభ్యర్ధుల ఎంపిక వరకు అన్నీ టిడిపి డైరక్షన్ లో పురందేశ్వరి తీసుకున్న నిర్ణయాలు సీనియర్లకి రుచించలేదు..కనీసం 25 అసెంబ్లీ, ఎనిమిది ఎంపి సీట్ల కోసం పోటీ పడిన బిజెపికి కేవలం ఆరు పార్లమెంట్, పది అసెంబ్లీ స్ధానాలు దక్కాయి..ఈ స్ధానాలలో అయినా బిజెపి అభ్యర్ధులకి అవకాశం ఇవ్వాలని…పార్టీలో మొదటి నుంచి కష్టపడిన వారికి ప్రాదాన్యత ఉండాలని..బిజెపి సీనియర్లు ఆశించారు..అందులో భాగంగానే జివిఎల్ విశాఖ ఎంపి స్ధానానికి, రాజమండ్రి స్ధానానికి సోము వీర్రాజు, ఏలూరు పార్లమెంట్ కి తపనా చౌదరి, హిందూపూర్ కి విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు ప్రయత్నించారు.

పార్టీ కోసం పనిచేసిన తమకు టిక్కెట్లు వస్తాయని భావించారు.అయితే పురందేశ్వరి రాజకీయాలతో వీరెవరికీ టిక్కెట్లు దక్కకపోగా…ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టిక్కెట్లలో ప్రాదన్యాతనివ్వడం సీనియర్లకి మింగుడుపడలేదు…తెలుగుదేశం పార్టీలో సుధీర్ఘకాలంగా ఉండి గత ఎన్నికల తర్వాత బిజెపిలో చేరిన సిఎం రమేష్, సుజనా చౌదరి, ఆదినారాయణరెడ్డి, కొత్తపల్లి గీత లకి టిక్కెట్లు దక్కాయి..ఇక గత ఏడాది బిజెపిలో చేరిన మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి సైతం ఎంపి టిక్కెట్లు దక్కించుకున్నారు. బిజెపి పోటీ చేస్తున్న ఆరు ఎంపి స్ధానాలలో అయిదు స్ధానాలలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే పోటీ చేస్తుండటంపై సీనియర్లకి మింగుడుపడటం లేదు.

దీంతో పాటు చివరి నిమిషంలో టిడిపి నుంచి రోషన్న ని చేర్చుకుని బద్వేలు టిక్కెట్ ఇవ్వడం…ఇక అనపర్తిలో మొదట ప్రకటించిన మాజీ సైనికుడిని కాదని రాత్రికి రాత్రి టిడిపి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడం పైనా సీనియర్లు అసహనంగా ఉన్నారు.దాదాపు పురందేశ్వరి తన స్వార్ధం కోసం బిజెపిని టిడిపి కి తాకట్టు పెట్టేయడంపై సీనియర్లంతా వ్యతిరేకంగానే ఉన్నారు. ఈ నేపధ్యంలోనే పురందేశ్వరి వైఖరితో విసుగెత్తిన సీనియర్లు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

విశాఖ టిక్కెట్ ఆశించి…చివరి వరకు ప్రయత్నించి భంగపడ్డ రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహరావు ఎక్కడా ఎన్నికల ప్రచారాలలో కనిపించడం లేదు..ఉత్తరాంద్రలో బిజెపి బలోపేతానికి తీవ్రంగా కృషి చేసిన జివిఎల్ తీవ్ర మనస్తాపంతో ఉన్నారని ప్రచారం జరుగుతోంది…అందుకే ఆయన ఢిల్లీకి పరిమితమైనట్లు తెలుస్తోంది.

ఇక సోము వీర్రాజు రాజమండ్రి ఎంపి స్ధానం కోసం పోటీ పడ్డారు..అయితే రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరికి ఆ టిక్కెట్ దక్కడంతో మౌనంగా ఉండిపోయారు. దాదాపు నాలుగన్నర దశాబ్ధాలగా పార్టీ కోసం పనిచేయడంతో పాటు స్ధానికుడైన తనను కాదని పురందేశ్వరికి టిక్కెట్ ఇవ్వడంపై ఆయన అసంతృప్తిగానే ఉన్నా కూడా పార్టీ ఆదేశాల మేరకు పురందేశ్వరి నామినేషన్ కార్యక్రమంలో మాత్రమే పాల్గొన్నారు.ఆ తర్వాత పురందేశ్వరి కలుపుపోకపోవడంతో ఎన్నికల ప్రచారానికి సోము వీర్రాజు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఏలూరు ఎంపి టిక్కెట్ కోసం ప్రయత్నించిన తపనా చౌదరి కూడా చివరి వరకు రెబెల్ అభ్యర్ధిగా పోటీ చేయాలని భావించారు.అయితే పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలతో వెనక్కి తగ్గిన తపనా చౌదరి ఎన్నికల ప్రచారాలకి దూరంగా ఉన్నారు.

జాతీయ స్ధాయి నాయకులు పాల్గొనే సభలలో మాత్రమే ఈ సీనియర్లంతా కనిపించి వెళ్లిపోతున్నారు. ఇక హిందూపూర్ టిక్కెట్ కోసం ప్రయత్నించి విఫలమైన విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం అనంతపురం జిల్లాలో జరిగే ఎన్నికల ప్రచారాలలో ఎక్కడా కనిపించడం లేదు. విష్ణు వర్ధన్ రెడ్డి కేవలం రాష్ట్ర కార్యాలయానికే పరిమితమయ్యారు. ఇక మరోవైపు శ్రీపీఠం పరిపూర్ణానందస్వామి రెబెల్ అభ్యర్ధిగా కదిరి అసెంబ్లీ, హిందూపూర్ పార్లమెంట్ బరిలో నిలబడటం కూటమి నేతలకి కలవరం కలిగిస్తోంది.

గన్నవరం అసెంబ్లీ నుంచి బిజెపి రెబెల్ గా బరిలో ఉన్న కొరుప్రోలు శ్రీనివాసరావుపై బిజెపి అధిష్టానం వేటువేసినప్పటికీ కూడా కూటమి పేరుతో టిడిపికి మేలు జరిగేలా తీసుకున్న నిర్ణయాలు బిజెపిని పూర్తిగా ముంచేసేలా కనపడుతున్నాయి…పురందేశ్వరి వైఖరితో పార్టీకి నష్టంనకలిగే చర్యలపై వరుస ట్వీట్లతో ఏకిపారేసిన మాజీ సిఎస్ మరియు బిజెపి నేత ఐవిఆర్ కృష్ణారావు సైతం ఎపి ప్రచారాలకి దూరంగా ఉన్నారు…ఈ నేపధ్యంలోనే సీనియర్లంగా కూడా పురందేశ్వరి కుట్ర రాజకీయాలపై తీవ్ర ఆగ్రహంతోనే ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది…వచ్చే వారంలో ప్రధాని సహ జాతీయ స్ధాయి నాయకుల ప్రచారాలుండటంతో సీనియర్లు ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి