బాబుపై మోదీ ఆగ్రహం..?

By KTV Telugu On 3 May, 2024
image

KTV TELUGU :-

ఊహాగానాలు మొదలయ్యాయి.టీడీపీకి, బీజేపీకి పొసగడం లేదన్న చర్చ తెరమీదకు వచ్చింది. బీజేపీ నేతలు అలిగారని చెప్పుకుంటున్నారు. పురంధేశ్వరి ఎందుకు వేదిక ఎక్కలేదో ఎవరికీ అర్థం కాలేదు. సిద్ధార్థ్‌నాథ్ సింగ్‌ ఏం మాట్లాడారో చెప్పినోళ్లకు మిలియన్ డాలర్లు ఇస్తామని జోకులు పేలుతున్నాయి. ఇదంతా ఏపీ ఎన్డీయే కూటమి  ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా జరిగిన ఒక  డ్రామా.  దీన్ని తంతు అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఎవరు పంతాలు వారికి కదా…

కూట‌మి మేనిఫెస్టో నాలుగు గంట‌లు జాప్యం జ‌రిగింది. దీని వెనుక పెద్ద త‌తంగ‌మే జ‌రిగింద‌ని కూట‌మి విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. మంగళవారం  మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు కూట‌మి మేనిఫెస్టోను చంద్ర‌బాబునాయుడు నివాసంలో విడుద‌ల చేస్తార‌ని ఒక రోజు ముందే మీడియాకు స‌మాచారం ఇచ్చారు. దీంతో మ‌ధ్యాహ్నం నుంచి మీడియాతో పాటు రాష్ట్ర ప్ర‌జానీకం ఎదురు చూడ‌సాగింది.ఇదిగో అదిగో అంటూ తీవ్ర జాప్యం చేశారు. ఈ నాలుగు గంట‌ల మ‌ధ్య కాలంలో ఏం జ‌రిగిందని ఆరా తీయ‌గా… పెద్ద త‌తంగ‌మే చోటు చేసుకున్న‌ట్టు తెలిసింది. మేనిఫెస్టో విడుద‌ల‌కు సంబంధించి మోదీ పెద్ద ఫొటోను ప్లెక్సీలో పెట్టారు. అయితే మేనిఫెస్టోలో భాగ‌స్వామ్యం లేని త‌మ‌ను ఎందుకు తెర‌పైకి తెస్తున్నార‌ని బాబు, ప‌వ‌న్‌ల‌ను బీజేపీ పెద్ద‌లు నిల‌దీసిన‌ట్టు తెలిసింది. మీడియా కాన్ఫ‌రెన్స్‌లో పెట్టే ప్లెక్సీలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మోదీ ఫొటో పెట్టొద్ద‌ని వార్నింగ్ ఇచ్చి, మ‌రీ దాన్ని మార్చేశార‌ని స‌మాచారం.మేనిఫెస్టో విడుద‌ల‌కు తాము హాజ‌ర‌య్యేది లేద‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ల‌కు బీజేపీ పెద్ద‌లు తేల్చి చెప్పారు. దీంతో వాళ్లిద్ద‌రు షాక్‌కు గురైన‌ట్టు తెలిసింది. ఇలాగైతే త‌మ మేనిఫెస్టోకు విలువ వుండ‌ద‌ని బీజేపీ పెద్ద‌ల‌కు మొర‌పెట్టుకున్న‌ట్టు తెలిసింది. తామేం చేయ‌లేమ‌ని, మేనిఫెస్టో అమ‌లు మంచీచెడుల‌కు మీరే బాధ్య‌త వ‌హించాల‌ని తేల్చి చెప్పిన‌ట్టు స‌మాచారం.

ఈ ప‌రిణామాల్ని ఊహించ‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు అస‌లేం జ‌రుగుతున్న‌దో అర్థం కాలేద‌ట‌. చివ‌రికి ఎంతో ప్రాథేయ‌ప‌డి బీజేపీ రాష్ట్ర స‌హ ఇన్‌చార్జ్ సిద్ధార్థ్‌నాథ్ సింగ్‌ను పాల్గొనేలా బీజేపీ పెద్ద‌ల్ని ఒప్పించారు. మేనిఫెస్టో ప్రతిని ఆయన టచ్ కూడా చేయలేదు….

మేనిఫెస్టో ప్రకటన  ప్రెస్  మీట్ లో బీజేపీ నేతలు మొక్కుబడిగా ఎందుకు హాజరయ్యారన్నది ఇప్పుడు అందరూ వేసుకుంటున్న ప్రశ్న. మేనిఫెస్టో రూపకల్పన ఏకపక్షంగా జరగడం, విపరీతమైన హామీలు ఇచ్చేయడం కూడా ఒక కారణం కావచ్చని చెబుతున్నారు….

జనసేనతో ఓకే.. టీడీపీతో పొత్తుకు చాలా మంది బీజేపీ నేతలు ఇష్టపడలేదు. అలాగని  బహిరంగ ప్రకటనలు చేయలేదు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కాసేపు ఇష్టం, కాసేపు కష్టం అన్నట్లుగా వ్యవహరించారు. చంద్రబాబుతో వేదిక పంచుకునే విషయంలో కూడా ఆమె వెనుకాముందు ఆడుతున్నారు. విధానాల్లో బీజేపీకి,  టీడీపీకి చాలా తేడా ఉండటమే ఇందుకు కారణమని చెప్పక తప్పదు. ఉచిత హామీలకు  జనం ఓట్లెయ్యరని  బీజేపీ నమ్మకం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనేక  ఉచిత హామీలిచ్చినా పార్టీ ఓడిపోయింది. పార్టీ విధానాలు, అగ్రనాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం వల్లె నెగ్గుతామని వారి ఆలోచన. అందుకే ఇప్పుడు చంద్రబాబు ఇబ్బడిముబ్బడిగా ఇచ్చిన హామీలకు మద్దతు పలికేది లేదని బీజేపీ నర్మగర్భంగా ప్రకటించింది. జగన్ ఎన్ని ఉచితాలు ఇచ్చినా  ఇప్పుడు ఆయనకు జనం ఓటెయ్యడం లేదని,వైసీపీ అవినీతికి ప్రజలు విసిగిపోయారని బీజేపీ అంచనా వేస్తోంది అలాగే టీడీపీ హామీలకంటే ఆ పార్టీ చేపట్టబోయే పనులకు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని, అయితే మేనిఫెస్టోలో హామీలే డామినేట్  చేస్తున్నాయని బీజేపీ విశ్వసిస్తోంది…

చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒక గ్రూపు… బీజేపీ విడిగా ఒక గ్రూపు అన్నట్లుగా ఉన్నదీ ప్రస్తుత పరిస్థితి. చంద్రబాబు, పవన్ ప్రసంగించే రోడ్ షోల్లో స్థానిక  అభ్యర్థులు పాల్గొంటున్నారే తప్ప.. బీజేపీ అగ్రనేతలు ఎవరూ రావడం లేదు. ఈనెలలో ప్రధాని మోదీ ఏపీ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని చెబుతున్నారు. అప్పుడు నేతల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో చూడాలి….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి